Home  »  TV News  »  Illu illalu pillalu : ప్రేమను కోపంతో హెచ్చరించిన వల్లి.. ధీరజ్ ప్లాన్ రివర్స్!

Updated : Aug 15, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -550 లో.. ధీరజ్‌కు విడాకులు ఇచ్చేయ్ అని ప్రేమతో వల్లి  చెప్పడంతో ప్రేమ కోపంతో తన చెంప చెళ్లుమనిపిస్తుంది. మా ఆయన మీద నాకు కోపం కాదు.. బాధ మాత్రమే. ఆయనపై నా ప్రేమ ప్రతి క్షణం పెరుగుతూనే ఉందని వల్లి మీద ప్రేమ కోప్పడుతుంది. నీ కాపురం గురించి ముందు చూసుకో.. ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. దీంతో అవమానంతో రగిలిపోయిన వల్లి.. నా ఇగో మీద కొట్టావు.. నీ కాపురాన్ని సర్వనాశనం చేసే వరకు నేను ఆగనంటూ పగ పెంచుకుంటుంది. మరోవైపు ప్రేమను కలిసిన ధీరజ్,.. ఆవేశంలో మాట్లాడిన మాటలకు నన్ను క్షమించమంటూ చేతులు జోడించి వేడుకుంటాడు. నిన్ను బాధపెట్టడం అంటే నన్ను నేను బాధపెట్టుకోవడమే అని తన ప్రేమను చెప్తాడు. 

అప్పుడే ముగ్ధ వచ్చి ధీరజ్‌ను హగ్ చేసుకోవడంతో ప్రేమ షాక్ అవుతుంది.  ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలకు నేను నీపై ప్రేమలో పడిపోయాను.. మా ఇంట్లో కూడా మన విషయం చెప్పేశానని ముగ్ధ చెబుతుంది. దాంతో ప్రేమ కోపంగా.. నీ మాటలకు, నువ్వు చూపించిన ప్రేమకు ఆమె పీకల్లోతు ప్రేమలో పడిపోయిందట కదా.. వెళ్లి ఆమెతో మాట్లాడుకో అంటూ ప్రేమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు అమూల్య కోసం కాలేజీ దగ్గర ఎదురుచూస్తున్న విశ్వతో ఆమె సరదాగా మాట్లాడుతుంది. మా వదిన బాధపడకుండా అన్నయ్య గురించి ఆలోచించేలా చేయాలి.. ఆయన ఎంతగా ఆమె కోసం తపిస్తున్నాడో అర్థమయ్యేలా చెప్పమని అమూల్య అంటుంది. అలాగే తన తండ్రి, అత్తయ్యలు ఏం ప్లాన్ చేస్తున్నారో ఎప్పటికప్పుడు చెప్పమని అడగడంతో.. ఫ్లాష్ న్యూస్ కంటే ఫాస్ట్‌గా నీకు అప్‌డేట్ ఇస్తానని విశ్వ అంటాడు.

ఇక ఇంటికి వెళ్లిన ప్రేమ ధీరజ్‌పై కోపంతో.. ఫ్లర్టింగ్ రాజా.. పెద్ద ఫ్లర్టింగ్ రాజా అంటూ బాధపడుతుంది. అప్పుడే రేవతి వచ్చి ప్రేమని ఓదార్చుతుంది. నువ్వు ధీరజ్‌ను పెళ్లి చేసుకుని ఎనిమిది నెలలు అయ్యింది. ఇంతకాలంలో ఎప్పుడైనా చనిపోవాలనే ఆలోచన వచ్చిందా అని అడుగుతుంది. లేదని ప్రేమ చెప్పడంతో.. ధీరజ్ నిన్ను అంతగా చూసుకున్నాడు కాబట్టే ఆ బాధ నీకు రాలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వారం రోజుల్లో కూడా నీ మనసంతా ధీరజ్ చుట్టూనే తిరుగుతోంది. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు అతడిని ఎందుకు వదిలి వచ్చావని ప్రశ్నిస్తుంది. ప్రేమ తనను ధీరజ్ మాటలే దూరం చేశాయని చెప్తుంది. రేవతి కోపంలో మాట్లాడటానికి, కావాలని మాట్లాడటానికి చాలా తేడా ఉంది. నీ గౌరవాన్ని కాపాడినవాడు నిన్ను కావాలని నలుగురిలో అవమానిస్తాడా అని గుర్తుచేస్తుంది. ఇష్టం లేకపోయినా తన తల్లి కోసం నీ మెడలో తాళి కట్టాడు.. తర్వాత నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడని చెప్పడంతో ప్రేమ ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu Illalu Pillalu, Star Maa Serials, Prema, Dheeraj, Illu Illalu Pillalu Latest Episode






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.